ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ జనగామ నీటి పారుదలశాఖ డీఈ రవీందర్‌రెడ్డి అవినీతి నిరోధశాఖ అధికారులకు చిక్కాడు. గుత్తేదారు నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం అవినీతి నిరోధకశాఖ అధికారులు నీటి పారుదలశాఖ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.