ఏపీలో కొత్తగా 2, 237 కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. నిత్యం రెండువేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఆ రాష్ట్రంలో కొత్తగా 2,237 కొవిడ్‌-19 కేసులు నమోదయ్యాయి.  దీంతో ఇప్పటివరకు వైరస్‌ బారినపడిన వారి సంఖ్య 8,42,967కు చేరింది. వైరస్‌ బారినపడిన వారిలో ఇవాళ 2,256 మంది కోలుకోగా.. 12 మంది మృతి చెందారు. ఏపీలో ఇప్పటివరకు 8.14 లక్షల మంది వైరస్‌ బారినపడి కోలుకున్నారు. మరో 21 21,403 మంది దవాఖాన, హోంఐసోలేషన్‌లో చికిత్స పొందున్నారు. ఇవాళ్టివరకు  6,791 మంది చనిపోయారు. గడిచన 24గంటల్లో 76,663 మందకి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇప్పటివరకు 86.63 లక్షల శాంపిళ్లను పరీక్షించినట్లు ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.