కురుమూర్తి జాతర మహోత్సవానికి సర్వం సిద్ధం చేయాలని పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆదేశించారు. ఆదివారం హైదరాబాద్‌లోని మంత్రి తన క్యాంపు కార్యాలయం నుంచి దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి కలెక్టర్ వెంకట్రావు, సంబంధిత అధికారులతో వీసీ ద్వారా మాట్లాడారు. కొవిడ్ నిబంధనల మేరకు గతేడాది కంటే ఇప్పుడు మరింత పకడ్బందీగా జాతర ఏర్పాట్లు చేయాలన్నారు. ఎక్కడ ఎలాంటి సమస్యలు రాకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. భౌతిక దూరం పాటిస్తూ దర్శనాలు చేసుకోవాలన్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లో అనే నినాదంతో భక్తులు పూర్తి స్థాయిలో జాగ్రత్తలు పాటిస్తూ మొక్కులు తీర్చుకోవాలని సూచించారు.