ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 1,886 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 67,910 శాంపిల్స్‌ను పరీక్షించగా వీటిలో 1,886 కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. ఒక్కరోజులో 2,151 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్‌తో 12 మంది చనిపోయారు. జిల్లాల వారీగా కొవిడ్-19 మరణాలు ఈ విధంగా ఉన్నాయి. చిత్తూరు, కృష్ణాలో ముగ్గురు చొప్పున, అనంతపూర్, తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం, విశాఖపట్నం, పశ్చిమగోదావరిలో ఒక్కరు చొప్పున మరణించారు. ఏపీలో ఇప్పటివరకు 8,15,473 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా వీటిలో 20,958 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 8,18,473 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. కొవిడ్‌తో రాష్ట్రంలో ఇప్పటివరకు 6,814 మంది మృత్యువాతపడ్డారు.
