జవాన్‌ మహేశ్‌ కుటుంబానికి రూ.50 లక్షల సాయం

సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో నిజామాబాద్‌ జిల్లాకు చెందిన జవాన్‌ మహేశ్‌ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన యోధుడిగా మహేశ్‌ చరిత్రలో నిలిచిపోతారన్నారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంగళవారం పేర్కొన్నారు. జవాన్‌ మహేశ్‌ కుటుంబానికి ప్రభుత్వ పరంగా రూ.50 లక్షల ఆర్థిక సహాయం, అర్హతను బట్టి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఇంటి స్థలం కూడా కేటాయిస్తామని ప్రకటించారు.