గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన హీరోయిన్‌ నభానటేశ్‌

రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా హీరోయిన్‌ నభానటేశ్ మొక్కలు నాటారు. బెంగళూరులోని తన నివాసంలో మొక్కలు  నాటి, నీళ్లు పోశారు. అనంతరం మాట్లాడుతూ ఎంపీ సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని మొక్కలు నాటినట్లు తెలిపారు. పచ్చదనం పెంచేందుకు చేపట్టిన కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ఆమె హీరో హీరోయిన్లు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, అను ఇమాన్యుల్‌, నిధి అగర్వాల్‌ను చాలెంజ్‌ స్వీకరించి, మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.