తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపు పొందిన 11 రాజకీయ పార్టీల నేతలతో రేపు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సమావేశం కానున్నారు. ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు ప్రతినిధులకు ఆహ్వానం అందింది. సమావేశంలో ఒక్కో పార్టీకి 15 నిమిషాల సమయం కేటాయించనున్నారు. గ్రేటర్ ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితా తయారీ సహా పలు అంశాలపై చర్చించి అభిప్రాయం తీసుకోనున్నారు.
ఓటర్ల ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, సూచనలు ఉంటే 11వ తేదీలోగా తెలుపాలని గ్రేటర్ ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ ఇటీవల కోరిన విషయం తెలిసిందే.