నేడు తెలంగాణ క్యాబినెట్‌ భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు జరుగనున్నది. ప్రగతిభవన్‌లో జరిగే ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశమున్నది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన పలు కార్యక్రమాలపై మంత్రివర్గం చర్చించి ఆమోదం తెలిపే అవకాశమున్నట్టు తెలుస్తున్నది.