
ఎన్నికల ఉల్లంఘనలపై ఫిర్యాదులు, ఎన్నికల సమాచారం కోసం టోల్‌ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ డా.ఎంవీ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేసిన ఆయన ఈ నెల 22వ తేదీన జరుగనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఓటరు గుర్తింపుకార్డు స్థితి, పోలింగ్ కేంద్రం, బీఎల్‌ఓల వివరాలు, ఓటర్లను ప్రభావితం చేసే అంశాలపై ఫిర్యాదులు, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన అంశాలపై ఫిర్యాదులు చేయడానికి, ఎన్నికలకు సంబంధించి సమగ్ర సమాచారం అందించడానికి జిల్లా ప్రజల సౌకర్యార్థం టోల్‌ఫ్రీ నంబర్లను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు.
టోల్ ఫ్రీ నంబర్లు :- 1950, 08518-1950, – 040-27885151, ఈ మెయిల్ – [email protected], ట్విట్టర్ – electionhelplinemedchal