ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి దంపతులు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం వైఎస్ జగన్, వైఎస్ భారతిరెడ్డి శుక్రవారం ఉదయం రాజ్‌భవన్‌కు వెళ్లారు. హిందువులకు అత్యంత ప్రాశస్త్యమైన దీపావళి పండుగ సందర్భంగా సీఎం జగన్.. గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలియచేశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, అమలవుతున్న సంక్షేమ పథకాలు తదితర అంశాలపై గవర్నర్‌తో ముఖ్యమంత్రి వివరించనున్నారు.
