టీఎస్ఐడీసీ అధ్య‌క్షుడిగా అమ‌ర‌వాది ల‌క్ష్మీనారాయ‌ణ‌

తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థ (టీఎస్ఐడీసీ) అధ్యక్షుడిగా ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణను నియమించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇందుకు సంబంధించి వెంటనే నియామక ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.