వనస్థలిపురంలోని సహారా ఎస్టేట్ రోడ్‌లో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో భారీ చోరీ జరిగింది. ఏటీఎంను గ్యాస్ కట్టర్‌తో తొలగించి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఏటీఎం మిషన్‌లో ఉన్న 6.5 లక్షల నగదుతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. సంఘటన స్థలానికి చేరుకున్న రాచకొండ పోలీసులు దుండగుల కోసం నాలుగు టీమ్స్ ను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
