గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన బిగ్ బాస్ ఫేం గంగ‌వ్వ‌

జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని లంబడిపెళ్లి గ్రామంలో నివసిస్తున్న గంగ‌వ్వ  మై విలేజ్ షో యూట్యూబ్ ఛానెల్‌తో ఫేమ‌స్ అయింది. ఇక  బిగ్ బాస్ సీజ‌న్ 4 లోను పార్టిసిపేట్ చేసి కొన్ని రోజులు సంద‌డి చేసిన ఈ అవ్వ అనారోగ్యంతో నిష్క్రమించింది.

మిల్కురి గంగవ్వ తాజాగా  గ్రీన్  ఛాలెంజ్ లో భాగముగా గ్రామ శివారులోని ప్రకృతి వనంలో మొక్కను నాటారు. ఈ సందర్భంగా  గంగవ్వ మాట్లాడుతూ గౌరవ రాజ్యసభ సభ్యులు జోగినిపెళ్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజలో భాగముగా తాను ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కను నాటనన్నారు. ఈ సందర్భంగా మొక్కలను నాటడంతో వాతావరణం లో సమతుల్యత ఏర్పడుతుందన్నారు.