తెలంగాణ రాష్ట్రంలో నాలుగు అటవీ డివిజన్‌లకు డివిజన్ అధికారులను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ అటవీ డివిజన్ అధికారిగా 2018 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్‌ఎస్ రాహుల్ కిషన్ జాదవ్‌ను నియమించింది. నాగర్ కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ అటవీ డివిజన్ అసిస్టెంట్ చీఫ్ కన్జర్వేటర్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న సుధాకర్ రావు ఇటీవల బదిలీ కావడంతో ఆయన స్థానంలో 2018 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్‌ఎస్ రోహిత్ గొప్పిడిని ఎఫ్‌డీఓగా నియమించింది.
ములుగు జిల్లా తాడ్వాయి అటవీ డివిజన్ అధికారిగా 2018 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్‌ఎస్ శివ్ ఆషిశ్ సింగ్‌కు అవకాశం కల్పించింది. కవ్వాల్ టైగర్ రిజర్వు సర్కిల్ పరిధిలోని నిర్మల్ అటవీ డివిజన్ అధికారిగా 2018 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్‌ఎస్ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్‌ను పోస్టు చేసింది. తదిపరి పోస్టింగ్ ఇచ్చేంత వరకు అమ్రాబాద్ అసిస్టెంట్ చీఫ్ కన్జర్వేటర్ అధికారి (నాన్- క్యాడర్) సుధాకర్ రావు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ కార్యాలయంలో రిపోర్టు చేయాలని సూచించారు.