జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ బలవంతయ్య, ఎస్‌ఐ సుధీర్‌ రెడ్డిపై వేటు

లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ బలవంతయ్య, ఎస్‌ఐ సుధీర్‌ రెడ్డిపై వేటు పడింది. వీరిద్దరిని సస్పెండ్‌ చేస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీపీ అంజనీ కుమార్‌ మాట్లాడుతూ.. పోలీసు శాఖలో ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు. పోలీసులు లంచం డిమాండ్‌ చేస్తే ఫిర్యాదు చేయాలని ప్రజలకు ఆయన సూచించారు. 94906 16555 నంబర్‌కు ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని అంజనీ కుమార్‌ చెప్పారు.