రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోశ్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమంలా కొనసాగుతోంది. సంతోశ్ కుమార్ పిలుపు మేరకు పలు రంగాల ప్రముఖులు విరివిగా మొక్కలు నాటి పర్యావరణ స్ఫూర్తిని చాటుతున్నారు. బుధవారం కోకాపేట్‌లోని తన నివాసంలో ప్రముఖ సినీ హీరోయిన్ కేథరీన్ ట్రెసా అలెగ్జాండర్ మొక్కలు నాటింది.
అనంతరం ఆమె మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటినట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ఎంపీ సంతోశ్ కుమార్ అద్భుత కార్యక్రమానికి పిలుపునిచ్చారని ఆమె పేర్కొన్నారు. అనంతరం సిద్ధార్థ్, తమిళ నటులు ఆర్య, అధర్వ మురళికి తాను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసురుతున్నట్లు వెల్లడించింది. తన స్నేహితులు, అభిమానులు ఇదే స్ఫూర్తితో మొక్కలు నాటాలని అభ్యర్థించింది.