కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ)లో కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 15 పోస్టులను భర్తీ చేయనుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు వచ్చే నెల 18 వరకు అందుబాటులో ఉంటాయి. ఎంపిక చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలుస్తారు.
మొత్తం పోస్టులు: 15
అర్హత: ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ లేదా ఇంజినీరింగ్ లేదా మేనేజ్‌మెంట్‌లో పీజీ చేసి ఉండాలి లేదా ఎన్విరాన్‌మెంట్ సైన్స్‌లో డిగ్రీ లేదా సివిల్ ఇంజినీరింగ్ చేసి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా. దరఖాస్తులో పేర్కొన్న అర్హతల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేసి ఇంటర్వ్యూకి ఆహ్వానిస్తారు.
దరఖాస్తుల ప్రారంభం: నవంబర్ 19
దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 18
వెబ్‌సైట్: cpcb.nic.in