టీఆర్‌ఎస్‌ శ్రేణులతో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ భేటీ

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులతో ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ శుక్రవారం భేటీ కానున్నారు. కార్యకర్తలను సమన్వయం చేయడంతో పాటు ప్రచారంపై శ్రేణులకు దిశానిర్దేశనం చేయనున్నారు. అలాగే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రచార సరళి తదితర అంశాలపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా శ్రేణులకు పార్టీలకు అభ్యర్థులను పరిచయం చేయనున్నారు. శనివారం కుత్బుల్లాపూర్‌ నుంచి కేటీఆర్‌ గ్రేటర్‌ ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. నగరంలోని వంద డివిజన్ల పరిధిలో ఈ నెల 29వ తేదీ వరకు రోడ్‌ షోలు నిర్వహించారు.