గతంలో ఎన్నడూ ఎరుగని విపత్తును ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియా గతంలో ఎన్నడూ ఎరుగని విపత్తును ఎదుర్కొంటుంది. అక్కడ ఆగ్నిఅడవులను దహించి వేస్తుంది. భారీ వృక్షాలు, చెట్లు సైతం కాలి బూడిదవుతున్నాయి. అనేక జంతువులు తమ ఆవాసాల్ని, ప్రాణాల్ని కోల్పోతున్నాయి. ”ఎక్కువగా అడవిపైనే ఆధారపడుతూ, ఎక్కువ దూరం ప్రయాణించలేని జీవులపైనే ఈ మంటల ప్రభావం అధికంగా ఉంటుంది. మంటల నుంచి తప్పించుకున్న జంతువులు కూడా మున్ముందు ఆహారం దొరక్కో, ఆవాసం లేకో ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఆగ్నికి 2,000 ఇళ్లు బుగ్గి అయినట్లు తెలుస్తుంది. ఆగ్నికి రాత్రి కూడా పగలుగా మారుతుంది.