ఇవాళ రాజమండ్రి నుంచి పోలవరం పరిరక్షణ యాత్రకు సీపీఐ రాష్ట్ర బృందం పిలుపునిచ్చింది. కాగా ఈ యాత్రను అనుమతి లేదంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణను రాజమండ్రిలోని హోటల్‌లో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. దీంతో పోలీసుల చర్యను ఖండిస్తూ ఇవాళ ఉదయం 11 గంటలకు పోలవరం పనుల పరిశీలనకు బయలుదేరి వెళ్తామని సీపీఐ నేతలు తెలిపారు.
