నల్లగొండ ఎస్పీ పేరిట మరోసారి నకిలీ ఫేస్‌బుక్ ఖాతా

 నల్లగొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ పేరిట మరోసారి నకిలీ ఫేస్ బుక్ ఖాతా తెరిచిన సైబర్ కేటుగాళ్లు మోసానికి పాల్పడ్డారు.  ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు, డబ్బులు వసూళ్లకు మోసగాళ్లు తెరలేపారు. ఈ విషయాన్ని గుర్తించిన జిల్లా ఎస్పీ రంగనాథ్ వెంటనే సైబర్ టీమ్‌ను అలెర్ట్ చేశారు. రెండు నెలల క్రితమే నకిలీ ఫేస్ బుక్ ఖాతాతో డబ్బులు పంపాలని కేటుగాళ్లు చాటింగ్ చేసినట్లు గుర్తించారు. గతంలో పట్టుబడ్డ సైబర్ నేరగాళ్లు ఇంకా జైల్లోనే ఉన్న విషయం తెలిసిందే.