కొవిడ్ నిబంధనల మేరకు ఎన్నికలు జరిగేలా పర్యవేక్షించేందుకు సర్కిళ్లు, వార్డులవారీగా వైద్యులను నోడల్ అధికారులుగా నియమిస్తున్నట్లు ఎన్నికల అథారిటీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ తెలిపారు. జీహెచ్‌ఎంసీ చీఫ్ మెడికల్ అధికారిని జీహెచ్‌ఎంసీ స్థాయి నోడల్ హెల్త్ ఆఫీసర్‌గా, అలాగే, సహాయ వైద్యాధికారులను సర్కిల్ స్థాయిలో నోడల్ అధికారులుగా నియమించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నోడల్ అధికారులు వార్డుస్థాయిలో అర్హులైన సిబ్బందిని గుర్తించి నియమిస్తారని తెలిపారు. వీరు కొవిడ్-19 నిబంధనల ప్రకారం పోలింగ్ కేంద్రాలతోపాటు మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు ఏర్పాట్లను పర్యవేక్షిస్తారని కమిషనర్ వివరించారు.
