రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కొత్త పుంతలు తొక్కుతూ… ఉద్యమంలా ముందుకు సాగుతోంది. తాజాగా ఈ ఛాలెంజ్‌ని బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనీల్ రావిపూడి స్వీకరించారు. గాలి సంపత్ సెట్‌లో శ్రీ విష్ణు, రాజేంద్ర ప్రసాద్, ఎస్ కృష్ణ,తదితరులు మొక్కలు నాటారు. ఇంత మంచి కార్యక్రమం మొదలు పెట్టిన సంతోష్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
కాగా, అనీల్ రావిపూడి రీసెంట్‌గా తన 38వ బర్త్‌డే వేడుకలు ఘనంగా జరుపుకున్నాడు. ఆయనకు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఎఫ్ 3 స్క్రిప్ట్ పనులతో బిజీగా ఉన్న అనీల్ రావిపూడి తన స్నేహితుడి కోసం కొత్త అవతారం ఎత్తాడు. కెరీర్ ఆరంభం నుంచి తన వెన్నంటి ఉన్న స్నేహితుడు కృష్ణ.. షైన్ స్క్రీన్ సాహుగారపాటి, హరీష్‌పెద్దితో కలిసి ‘గాలి సంపత్’ సినిమా చేస్తున్నాడు. ఓ మిత్రుడిగా ఆ సినిమాకు క్రియేటివ్ సపోర్ట్‌ను అందిస్తున్నా. స్క్రీన్‌ప్లేను సమకూర్చుతున్నా. భవిష్యత్తులో కృష్ణ నిర్మించే సినిమాలకు నా సహాయం అందించాలనుకుంటున్నా అని రీసెంట్ ఇంటర్వ్యూలో తెలిపారు.