మ‌హేష్‌, అల్లు అర్జున్ సినిమాలకు ఐదు షోలకి అనుమ‌తి

స‌రిలేరు నీకెవ్వ‌రు, అల వైకుంఠ‌పుర‌ము సినిమాలకు ఐదు షోలకి తెలంగాణ ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. ఇప్ప‌టికే ఈ రెండు సినిమాల అడ్వాన్స్ మొద‌లు కాగా, దాదాపు వారం రోజుల పాటు షోస్ హౌజ్‌ఫుల్ అయిన‌ట్టు తెలుస్తుంది. మ‌హేష్‌, బ‌న్నీ సినిమాల కోసం ఐదో అనుమ‌తి ఇస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. రేప‌టి నుండి ఈ నెల 24వరకు స‌రిలేరు నీకెవ్వ‌రు ఐదో షోకి అనుమ‌తి ఇవ్వ‌గా, అల వైకుంఠ‌ప‌రము చిత్రానికి 12 నుండి 25 వ‌ర‌కు అనుమ‌తి ఇచ్చారు. అలాగే ఈ సినిమాల టిక్కెట్ ధరలు కూడా పెంచారు. పెరిగిన టికెట్ ధ‌ర‌లు వారం రోజుల పాటు అమ‌లులో ఉంటాయంటున్నారు.