గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కౌన్సిల్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల పోలింగ్ వచ్చే నెల 1న జరుగనుంది. దీంతో జీహెచ్ఎంసీ పరిధిలో మూడు రోజుల పాటు వైన్స్ షాపులు మూతపడనున్నాయి. ఈ నెల 29 నుంచి డిసెంబర్ 1 వరకు (వచ్చే ఆదివారం నుంచి మంగళవారం వరకు) గ్రేటర్ పరిధిలో మద్యం విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో వచ్చే ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం (డిసెంబర్ 1) సాయంత్రం 6 గంటల వరకు, తిరిగి ఓట్లు లెక్కించే డిసెంబర్ 4న (శుక్రవారం) ఉదయం 6 గంటల నుంచి ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు మద్యం విక్రయాలను నిషేధిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు.
