నివర్ తుఫాన్ పుదుచ్చేరి సమీపాన తీరాన్ని తాకింది. తమిళనాడు ఉత్తర తీర ప్రాంతం, పుదుచ్చేరి వాయువ్య దిశగా కదులుతోంది. దీంతో ఉత్తర తమిళనాడు, దక్షిణాంధ్ర, రాయలసీమ బెంగుళూరు, తెలంగాణల మీద ప్రభావం పడనుంది. ఉత్తరకోస్తాంధ్రలో ఓ మోస్తరు నుంచి చెదురుమదురు జల్లులు కురిసే అవకాశం ఉంది. అదే విధంగా ప్రకాశం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.
