తెలంగాణ రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ లోక భూమా రెడ్డి తెలిపారు. గురువారం ఆదిలాబాద్‌లో విజయ డెయిరీ పాలు, పాల పదార్థాల విక్రయ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల విజయ డెయిరీని నిర్లక్ష్యం చేశారన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో విజయ డైయిరీ అన్ని రకాల అభివృద్ధి చెందుతుందని, రోజుకు 5 లక్షల లీటర్ల పాలను విక్రయిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
పాడి రైతులకు సబ్సిడీపై బర్రెలను పంపిణీ చేస్తున్నామని అన్నారు. విజయ డెయిరీకి పాలు పోసిన రైతులకు లీటరుకు నాలుగు రూపాయల చొప్పున ప్రోత్సాహం అందిస్తున్నట్లు తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా విజయ పాలు, పాల ఉత్పత్తులను పెంచడానికి నూతనంగా పార్లర్ ను ప్రారంభిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రైతులు విజయ డెయిరీ కేంద్రాల్లో పాలు పోసి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు పొందాలని సూచించారు.