ఢిల్లీ ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి గోపాల్ రాయ్‌కి క‌రోనా

ఢిల్లీ ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి గోపాల్ రాయ్‌కి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దాంతో ఆయ‌న వెంట‌నే చికిత్స కోసం ఢిల్లీలోని మాక్స్ ఆస్ప‌త్రిలో చేరారు. అయితే, గోపాల్ రాయ్‌కి క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల్లో కొవిడ్ పాజిటివ్‌గా తేలిన‌ప్ప‌టికీ, ఆయ‌న‌లో ఎలాంటి సింప్ట‌మ్స్ బ‌య‌ట‌కు క‌నిపించ‌డంలేద‌ని, ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉన్న‌ద‌ని వైద్యులు తెలిపారు. కాగా, త‌న‌కు క‌రోనా పాజిటివ్‌గా తేల‌డంతో.. ఇటీవ‌లి వ‌ర‌కు త‌న‌తో స‌న్నిహితంగా మెలిగిన అధికారులు, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు క‌రోనా పరీక్ష‌లు చేయించుకోవాల‌ని గోపాల్ రాయ్ సూచించారు.