రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. 15 వేలకు పైగా నామినేషన్లు దాఖలైనట్లు తెలుస్తుంది. నామినేషన్లు మొదలైన రోజు 967 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. రెండో రోజు 4,772 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజు 10 వేలకు పైగా నామినేషన్లు వేశారు. 9 కార్పోరేషన్లు, 120 మున్సిపాలిటీలకు ఈ నెల 22వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. 25వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. మొత్తం 325 కార్పోరేషన్లు, 2727 కౌన్సిలర్ డివిజన్లుకు ఎన్నికలు జరుగుతాయి. రేపు అధికారులు నామినేషన్ల పరిశీలన ప్రక్రియ చేపట్టనున్నారు. నామినేషన్ల ఉపసహరణకు ఈ నెల 14వ తేదీ వరకు గడువు ఉంది. బీ -ఫారాల విషయంపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే వరకు బీ – ఫారాలు ఇవ్వొచ్చని ఎన్నికల సంఘం తెలిపింది. 14వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు బీ – ఫారాలు ఇవ్వొచ్చని తెలిపింది.