హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్టు అధికారిగా దాసరి బాలయ్య (2008 ఐఆర్ఎస్ బ్యాచ్)ను నియమిస్తూ కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఇక్కడ రీజినల్ పాస్‌పోర్టు అధికారిగా పనిచేసిన విష్ణువర్ధన్‌రెడ్డి బదిలీ కావడంతో ఆయన స్థానంలో బాలయ్య నియమితులయ్యారు. ప్రస్తుతం ఒడిశాలోని భువనేశ్వర్ జోన్ జీఎస్టీ కమిషనరేట్‌లో జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తున్న బాలయ్యను హైదరాబాద్‌కు బదిలీ చేశారు. మూడేండ్లపాటు డిప్యుటేషన్‌పై ఈ పదవిలో ఆయన కొనసాగుతారు.
