కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం జరిగింది. మంత్రి తన ఇంట్లో ఉండగానే ఓ దుండగుడు… తాపీతో ఆయనపై దాడి చేయబోయాడు. అంతలోనే అప్రమత్తమైన అనుచరులు… ఆ దుండగుణ్ని పట్టుకొని… బలవంతంగా నిలువరించారు. మంత్రి అనుచరులు బలంగా పట్టుకొని అతన్ని వెనక్కి నెట్టి… తాపీ లాక్కున్నారు. ఈ దాడిలో మంత్రి చొక్కా పూర్తిగా చినిగిపోయింది. మొత్తానికి ఈ దాడి నుంచి మంత్రి తృటిలో తప్పించుకున్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతను ఎవరు, ఎందుకు దాడి చేయాలనుకున్నాడు, మంత్రిని చంపేయాలనేంత కసి ఎందుకు పెంచుకున్నాడు వంటి అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
