ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్న సమావేశాల్లో ప్రభుత్వం పలువురి సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టనుంది. అనంతరం బీఏసీ సమావేశం నిర్వహించనుంది. శాసనసభ ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏయే అంశాలు చర్చించాలో బీఏసీ నిర్ణయించనుంది. తొలిరోజు వ్యవసాయ రంగంపై చర్చించనున్నారు. నివర్ తుపాను ప్రభావంపై అసెంబ్లీలో ప్రభుత్వం చర్చించనుంది. నివర్ తుపాను ప్రభావంపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. 19 బిల్లులను ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది.
