గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన మాజీ క్రికెట్ ప్లేయర్ చాముండేశ్వరినాథ్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నర్సాపూర్ ఎంపీ రఘురాంకృష్ణంరాజు విసిరిన ఛాలెంజ్ స్వీకరించిన మాజీ క్రికెట్ ప్లేయర్ చాముండేశ్వరినాథ్.
గచ్చిబౌలి బౌల్డర్ హిల్స్ లోని తన నివాసంలో మొక్కలు నాటిన చాముండేశ్వరినాథ్.
సంతోష్ కుమార్ చొరవ తీసుకొని చేస్తున్న ఈ కార్యక్రమనికి దేశవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. దేశవ్యాప్తంగా విస్తరించేందుకు దీనికి నా వంతు సహాయం, ప్రచారం చేస్తాను.
ఈ సందర్భంగా పుల్లెల గోపిచంద్, పివిసింధు తల్లి విజయ, సినీ హీరో నాగ చైతన్య ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ విసిరిన చాముండేశ్వరినాథ్.
ఈ కార్యక్రమంలో గ్రీన్ ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, హెల్పింగ్ హ్యాండ్స్ నిర్వాహకులు సుబ్బరాజు, వినయ్ పాల్గొన్నారు.