జీడిమెట్ల పారిశ్రామికవాడలోని కంపెనీలో అగ్ని ప్రమాదం

జీడిమెట్ల పోలీస్టేషన్‌ పరిధిలోని పారిశ్రామికవాడ ఫేస్‌-4లోని హైటెక్‌ అలుకాస్ట్‌ ప్రైవేట్‌ లిమిటె కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. సెలవు దినం కావడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో కంపెనీ వద్దకు చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు. అగ్ని ప్రమాదంలో రూ.5 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని కంపెనీ యాజమాన్యం తెలిపింది. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.