సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశంపై ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. జనవరిలో కొత్త పార్టీ పెట్టనున్నట్లు తలైవా గురువారం ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు డిసెంబరు 31న వెల్లడిస్తానని ట్విటర్ వేదికగా స్పష్టం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు పేర్కొన్నారు. దీంతో తమకు అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చారంటూ తలైవా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రజనీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశిస్తుండటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
