తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి‌ రాజీనామా

తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం ప్రకటించారు. ఈ మేరకు ఏఐసీసీకి లేఖను పంపించారు. కాగా గ్రేటర్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాభవానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ఉత్తమ్‌ లేఖలో పేర్కొన్నారు. తాను పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానని తెలిపిన ఉత్తమ్‌.. గతంలోనే ఏఐసీసీకి లేఖ రాశానని, ఆమోదించాలని కోరారు. కొత్త పీసీసీ అధ్యక్షుడిని నియమించుకోవాలని లేఖలో పేర్కొన్నారు.