గజ్వేల్‌ మున్సిపల్‌ చైర్మన్‌కు సీఎం కేసీఆర్‌ పరామర్శ

కరోనా బారిన పడిన గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్.సి. రాజమౌళిని సీఎం కేసీఆర్‌ శుక్రవారం ఫోన్‌చేసి పరామర్శించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రామచంద్రాపురం డివిజన్‌ బూత్‌-1 ఇంచార్జి బాధ్యతలు చేపట్టిన ఈయన చురుగ్గా ప్రచారం నిర్వహించారు. ఇటీవల కరోనా పాజిటివ్‌ రావడంతో మంత్రి హరీశ్‌రావు చొరవతో యశోద దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్‌ ఫోన్‌చేసి రాజమౌళితో మాట్లాడి ధైర్యం చెప్పారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.