గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి ఎంపికపై టీఆర్ఎస్ దృష్టి సారించింది. గెలిచిన అభ్యర్థుల పూర్తి స్థాయి సమచారం, వ్యక్తిగత వివరాలు, విద్యా, నైపుణ్యత, నాయకత్వధోరణి, ప్రజలతో కలిసిపోయే మనస్థత్వాన్ని టిఆర్ఎస్ అధిష్టానం పరిశీలిస్తుంది. అలాగే టిఆర్ఎస్కు ఎందిన ఎక్స్ అఫిషియోసభ్యుల ఓటుతో గ్రేటర్పీఠం దక్కించుకోవాలా? ఎంఐఎంతో స్నేహం పెంపొందించుకుని రాజకీయ సర్దుబాటు చేసుకావాలనే అంశంపై టీఆర్ఎస్ దృష్టి సారించి. అలాగే జీహెచ్ఎంసీ చట్టాల్లో ఉన్న వెసులుబాటును ఉపయోగించుకుని ప్రస్తుత పాలకమండలిని రద్దుచేసి కొత్త పాలక మండలిని ఏర్పాటుచేయాలా? లేదా ఫిబ్రవరి 10 వరకు పాతపాలక మండలినే కొనసాగించాలనే అశంపై టీఆర్ఎస్ పార్టీ సమీక్షలు నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి,టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గెలిచిన కార్పొరేటర్లు, జీహెచ్ఎంసీ పరిధిలోని టీఆర్ఎస్ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, రాజ్యసభ, లోక్ సభ సభ్యులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఎక్స్అఫిషియో సభ్యులకుదిశానిర్దేశం, పాలకమండలి గడువు, మేయర్ అభ్యర్థి, ఎంఐఎంతో రాజకీయ సర్దుబాటు అంశాల్లో సమీక్ష జరగనుంది.
