డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 2020–21 విద్యాసంవత్సరానికి డిగ్రీలో ప్రవేశాల గడువును మరోమారు పొడిగించింది. వర్సిటీ అందిస్తున్న వివిధ కోర్సుల్లో చేరడానికి ఈ నెల 17 వరకు అవకాశం కల్పించింది. బీఏ, బీకాం, బీఎస్సీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు పొందడానికి అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైనవారు, ఇంటర్, డిప్లొమా, ఐటీఐ పాసైన విద్యార్థులు www.braou.ac.in వెబ్‌సైట్‌లో రిజిస్ర్టేషన్ చేసుకొని ఫీజు చెల్లించవచ్చు.
