
ఈ నెల ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం కానుంది. ఈ సందర్భంగా హై పవర్ కమిటీ నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. రాజధాని సహా రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణపై సభలో చర్చించే అవకాశం ఉంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీఎన్ రావు నేతృత్వంలోని కమిటీ సిఫార్సులు, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఇచ్చిన నివేదిక, గతంలో కేంద్రం వేసిన శివరామకృష్ణన్ కమిటీ నివేదికలోని అంశాలపై అసెంబ్లీలో చర్చించనున్నారు. అలాగే ఈ నెల 18న కేబినెట్ భేటీ కానుందని సమాచారం.