సిద్దిపేటలో సీఎం కేసీఆర్ గురువారం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సిద్దిపేటలో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను సీఎం ప్రారంభించనున్నారు. రెండుపడక గదుల ఇళ్ల ప్రాంతానికి కేసీఆర్ నగర్ అని నామకరణం చేశారు. సీఎం పర్యటనకు మంత్రి హరీశ్‌రావు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. రూ.163 కోట్ల వ్యయంతో 2460 ఇళ్ల నిర్మాణం జరిగిందన్నారు. తొలి విడతలో 1,341 ఇళ్లు, రెండో విడతలో వెయ్యి ఇళ్లు లబ్దిదారులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.