పంటలపై కాలుష్యం పడగ

అంజనీ సిమెంట్‌ పరిశ్రమ ఎదుట పురుగుల మందు డబ్బాతో  రైతుల ఆందోళన

చింతలపలెం మండలంలోని అంజనీ సిమెంట్‌ పరిశ్రమ (చెట్టినాడు సిమెంట్‌) ఎదుట స్థానిక రైతులు గురువారం ధర్నా చేపట్టారు. పరిశ్రమ కాలుష్యంతో పంటలకు నష్టం వాటిల్లుతుందని పురుగుల మందు డబ్బాలతో నిరసన తెలిపారు.  చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా బాధిత  మాట్లాడుతూ పరిశ్రమ నుంచి వెలువడుతున్న దుమ్ము, ధూళి చుట్టుపక్కల పంట పొలాల మీద పడి దిగుబడి తక్కువగా వస్తుందన్నారు. అదేవిధంగా రోడ్లపై పరిశ్రమ యాజమాన్యం సరిగ్గా నీళ్లు పోయకపోవడంతో మైన్స్‌, ఇతర ప్రాంతాల నుంచి పరిశ్రమకు వస్తున్న లారీలు, వాహనాలతో  పొలాల్లో దుమ్ము, ధూళి  పేర్కొన్నారు.  పంట దిగుబడి తక్కువగా వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.  పరిష్కరించి నష్టపోయిన పంటకు పరిహారం చెల్లించాలని 8 సంవత్సరాల నుంచి   ఫిర్యాదులు చేస్తున్నామని, అయినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమ నుంచి  వాయువులతో నీరు, గాలి కాలుష్యమై చుట్టుపక్కల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వాయు కాలుష్యంతో శ్వాసకోశ సంబంధ వ్యాధులు, కలుషిత నీటితో  వ్యాధుల బారిన పడుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో రైతులు పొల్లా వెంకటేశ్వర్‌రావు, పత్తిపాటి విజయ్‌, పూజ గోపయ్య, దేవిరెడ్డి వెంకట్‌రెడ్డి, దాసరి లింగారావు, మేడిశెట్టి వెంకయ్య, చిలకల పెద్దిరెడ్డి, తేరోజమ్మ, బేబీరాణి తదితరులు పాల్గొన్నారు.30 రోజుల్లో సమస్యలను పరిష్కరిస్తాం- రాంబాబు, అంజనీ సిమెంట్‌ పరిశ్రమ ఏజీఎంఅంజనీ సిమెంట్‌ పరిశ్రమ (చెట్టినాడు సిమెంట్‌) ఎదుట రైతులు ధర్నా చేపట్టడంతో  పరిశ్రమ ఏజీయం రాంబాబు రైతుల సమస్యలను 30 రోజుల్లో పరిష్కరిస్తామన్నారు. రైతుల ఫిర్యాదుల మేరకు నీటి కలుషితం, ఉచిత వైద్యంపై పరిశ్రమ అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

నష్టపరిహారం చెల్లించాలి..

నాకు చింతలపాలెం మండలం గుడిమల్కాపురం గ్రామ శివారులో 4 ఎకరాల భూమి ఉంది. మరో నాలుగెకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నా. 8 ఎకరాల్లో 4ఎకరాల మిర్చి, 2ఎకరాలు పత్తి పంట వేశాను. పరిశ్రమ నుంచి వస్తున్న దుమ్ము, ధూళితో పంట దిగుబడి రావడం లేదు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేను పూర్తిగా నాశనమైంది. పెట్టిన పెట్టుబడి రాక చాలా ఇబ్బందులు పడుతున్నాం.  యాజమాన్యం స్పందించి నష్టపోయిన పంట విలువను అంచనా వేసి  చెల్లించాలి.     – పూజ మేరమ్మ, గుడిమల్కాపురం

చావాలో, బతకాలో అర్థం కావట్లేదు..

గుడిమల్కాపురంలో పరిశ్రమకు ఆనుకోని నాకు ఆరెకరాల భూమి ఉంది. మొత్తం మిర్చి పంట  కొన్ని సంవత్సరాలుగా  నుంచి వెలువడే దుద్ము, ధూళితో పంట పూర్తిగా పాడైపోయింది. వ్యవసాయాన్నే నమ్ముకున్న మాకు ప్రతి సంవత్సరం పంట నష్టపోతున్నాం.పెట్టిన పెట్టుబడి రాక చావాలో,  బతుకాలో అర్థం కావడం లేదు. – దేవిరెడ్డి వెంకట్‌రెడ్డి, గుడిమల్కాపురం