నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోని కొల్లాపూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కటికనేని మధుసూదన్‌రావు మంగళవారం కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మధుసూదన్ రావు.. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మధుసూదన్‌రావు మృతిపట్ల శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి నిరంజన్ రెడ్డి, కొల్లాపూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు వారు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 1994 నుంచి 1999 వరకు కొల్లాపూర్ ఎమ్మెల్యేగా మధుసూదన్‌రావు సేవలందించారు.