రైతుబంధు దరఖాస్తులు ఈ నెల 20 వరకు..

రైతుబంధు పథకానికి కొత్త రైతుల నుంచి వ్యవసాయశాఖ దరఖాస్తులు స్వీకరిస్తున్నది. బ్యాంకుఖాతా నంబర్లు, పేర్లు, ఆధార్‌నంబర్లు తప్పుగా ఉన్నవారు కూడా సరైన వివరాలను అందించాలని సూచించింది. ఈ నెల 20 వరకు వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈవో)కి వివరాలు అందించాలని సూచించింది. ఈ నెల పది వరకు ధరణిలో నమోదైన రైతుల వివరాలను సీసీఎల్‌ఏ నుంచి వ్యవసాయశాఖ సేకరించింది. ఈ నెల 27 నుంచి రైతుబంధు పంపిణీ చేయనున్నట్టు సీఎం కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.