తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమ కోహ్లీ నియమితులయ్యారు. ప్రస్తుతం హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్న జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్‌ను ఉత్తరాఖండ్‌కు బదిలీ అయ్యారు. ఢిల్లీలో సమావేశమైన ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కూడిన కొలీజియం పలువురు హైకోర్టు న్యాయమూర్తుల నియామకం, బదిలీలకు సంబంధించి సిఫారసులు చేసింది.