
సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు పయనమైన వారితో హైదరాబాద్-విజయవాడ రహదారి రద్దీగా మారింది. పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. ఫాస్టాగ్ మార్గం, నగదు చెల్లింపు కేంద్రాల వద్ద వాహనాలు బారులు తీరాయి. వాహనాలు కిలోమీటర్ మేర నిలిచిపోయాయి. నగరంలోని ఎంజీబీఎస్, జేబీఎస్, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ప్రయాణికులు కిక్కిరిసిపోయారు.