రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సక్సెస్‌ఫుల్‌గా ముందుకు సాగుతుంది. సంతోశ్ కుమార్ పిలుపు మేరకు పలు రంగాల ప్రముఖులు విరివిగా మొక్కలు నాటి పర్యావరణ స్ఫూర్తిని చాటుతున్నారు. టాలీవుడ్ ప్రముఖులే కాక బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్స్ కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటుతున్నారు.
గురువారం రోజు ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ మొక్కలు నాటారు. గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించి గచ్చిబౌలిలోని కేజీఎఫ్ 2 షూటింగ్ జరుగుతున్న ప్రదేశంలో 8 మొక్కలు నాటారు. ఇక ఈ రోజు బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ సంతోష్ కుమార్ తో కలిసి మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని ఆయన అన్నారు. కాగా, అజయ్ దేవగణ్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. మరో వైపు మేడే అనే సినిమా చేసుకున్నారు. ఈ చిత్రాన్ని అజయ్ దేవగణ్ తెరకెక్కిస్తుండగా, అమితాబ్, రకుల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.