టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచే రాయపాటి ఇంట్లో సీబీఐ తనిఖీలు కొనసాగుతున్నాయి. ట్రాన్స్ ట్రాయ్ కంపెనీకి సంబంధించిన పలు రికార్డులను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి రాయపాటి సాంబశివరావు కుటుంబ సభ్యుల్ని కూడా సీబీఐ అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం.
