తెలంగాణ రాష్ట్ర అట‌వీశాఖ‌లో బ‌దిలీలు

తెలంగాణ రాష్ట్ర అట‌వీశాఖ‌లో బ‌దిలీలు జ‌రిగాయి. మేడ్చ‌ల్ జిల్లా అట‌వీ అధికారిగా కొన‌సాగుతున్న‌ సుధాక‌ర్ రెడ్డి..  అర‌ణ్య భ‌వ‌న్‌లో విజిలెన్స్ డీఎఫ్‌వోగా నియామ‌కం అయ్యారు. మేడ్చ‌ల్ జిల్లా అట‌వీ అధికారిగా ఏ. వెంక‌టేశ్వ‌ర్లు నియామ‌కం అయ్యారు. డిప్యుటేష‌న్‌పై జీహెచ్ఎంసీ అర్బ‌న్ ఫారెస్ర్టీ డిప్యూటీ క‌న్జ‌ర్వేట‌ర్‌గా ఎస్. రాజ‌శేఖ‌ర్ నియామ‌కం అయ్యారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.