పాలకుర్తి తహసిల్దార్ బి. రాజ‌మ‌ణిని సస్పెండ్ చేసిన ఇంచార్జ్ కలెక్టర్ భారతి హోలీకేరి

పాలకుర్తి తహసిల్దార్ బి.రాజమణిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ జిల్లా ఇంచార్జి కలెక్టర్ భారతి హోళీకేరి ఉత్తర్వులు జారీ చేశారు. మండలంలోని పాలకుర్తి గ్రామంలో సర్వే నెంబర్ 535 లో గల భూమి రికార్డుల ప్రకారం 2018-19 మరియు 2019-20 సంవత్సరాలలో ప్రభుత్వ పోరంబోకు స్థలంగా ఉంది. మండలానికి సంబంధించి భూముల వివరాలు ఫారం 1 లో సమర్పించే సమయంలో సదరు భూమిని తహసిల్దార్ నమోదు చేయలేదు. పాలకుర్తి మండల తహసిల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న బి.రాజమణి జిల్లా ఉన్నతాధికారుల నుంచి గాని, శాఖాపరంగా ఉన్నతాధికారుల నుంచి గాని ఎటువంటి ఆదేశాలు రానప్పటికీ సదరు భూమిని మూడు సర్వే నెంబర్లు సబ్ డివిజన్ చేసి మాదాసు శంకరయ్య, మాదాసు రాజయ్య, మాదాసు మల్లేశం పేర్ల మీద పట్టా చేసి సదరు భూములను ఆన్ లైన్ పహానిలో చేర్చారు. ప్రభుత్వ పోరంబోకు భూమి 4 ఎకరాల స్థలం ప్రైవేట్ వ్యక్తుల పేరుమీదుగా నమోదుచేయ‌డంపై చ‌ర్య‌లు తీసుకుంటూ త‌హ‌సిల్దార్‌ను స‌స్పెండ్ చేశారు.